Top News

చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. రూ.2 లక్షల క్యాష్‌ను గాల్లోకి విసిరేసిన కోతి!

 


ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ రిజిస్ట్రీ కార్యాలయం వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల కోసం రూ.2 లక్షల నగదుతో వచ్చిన వ్యక్తి చేతిలోని బ్యాగును ఓ కోతి లాక్కొని చెట్టుపైకి ఎక్కింది.

బ్యాగును తెరిచిన కోతి అందులోని రూ.100, రూ.500 నోట్ల కట్టలను ఒక్కొక్కటిగా గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిసినట్లు కనిపించగా, అక్కడున్న జనం వాటిని ఏరుకోవడానికి పరుగులు తీశారు.

ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు కాగా, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల సహాయంతో బాధితుడు ఎక్కువ మొత్తంలో నగదును తిరిగి సేకరించగలిగాడు. కోతి చేసిన ఈ విచిత్ర పనిపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post