Posts

బనగానపల్లె పేదలకు గుడ్‌న్యూస్.. ఇళ్ల పట్టాలపై మంత్రి కీలక ప్రకటన

Image
  సొంత ఇల్లు లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న బనగానపల్లె ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బనగానపల్లె ప్రజలకు సొంత ఇళ్ల పట్టాలు ఇవ్వడం చిరకాల వాంఛ అని మంత్రి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. అయితే ఈసారి అర్హతను నిర్ధారించేందుకు ఆరు దశల్లో వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న వారికే పట్టాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కొందరి నుంచి డబ్బులు తీసుకున్న ఘటనలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. అందుకే ప్రజలు దళారులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ఇళ్ల పట్టాల విషయంలో ఎవరి పైరవీలు పనిచేయవని, అర్హతే ప్రాతిపదికగా ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో మూడు వేల మందికి పైగా పట్టాలు ఇస్తామని అర్జీలు తీసుకున్నారని, ఆ జాబితాను పరిశీలించగా పెద్ద సంఖ్యలో అనర్హులు, స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. దీంతో కొత్తగా దరఖాస్త...

పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ ఉండగానే.. అనంతపురానికి మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకు?

Image
  అనంతపురం జిల్లాకు మరో విమానాశ్రయం రాబోతుందా? ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పుట్టపర్తిలో ఎయిర్‌పోర్ట్ ఉన్నప్పటికీ.. అనంతపురంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన వెళ్లింది. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి అనంతపురం ఎయిర్‌పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు. అనంతపురం జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇక్కడి ఉద్యాన పంటలు, పరిశ్రమల ఉత్పత్తులను వేగంగా ఇతర ప్రాంతాలకు తరలించాలంటే విమానాశ్రయం అవసరమని వివరించారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే ఉండగా.. అనంతపురానికి మరో విమానాశ్రయం ఎందుకు? అనంతపురానికి పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో అనంతపురం సమీపంలోని కూడేరు ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వన్‌సైడ్ ల్యాండింగ్ విధానంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం సాధ...

వర్షం కోసం శునకానికే పూజలు.. అనంతపురంలో అసలేం జరుగుతోంది?

Image
ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ చినుకు జాడ కనిపించకపోవడంతో చివరికి తమ పూర్వీకుల నాటి ఆచారాన్ని పాటించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామంలో వర్షాల కోసం గ్రామస్థులు ఓ శునకానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ శునకాన్ని కాటమయ్యగా భావించి , పూలతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం దాన్ని గ్రామంలో ఊరేగించారు. ఆ తర్వాత పెళ్లి వేడుకను తలపించేలా పలు రకాల వంటకాలు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఆ తర్వాత జరిగింది. పూజలు పూర్తయ్యాక శునకాన్ని ఒక చోట ఉంచి నీళ్లు ఇవ్వకుండా ఉంచారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్థుల నమ్మకం. వర్షం కోసం ఇలాంటి ఆచారాలు అనంతపురానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాలు, పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సింహాచలంలో వరుణ యాగం నిర్వహించగా, చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కూడా వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. అయితే కొట్టాలపల్లిలో జరిగిన ఈ ఆచారం ఇప్పుడు ఒక ప్రశ్నను ముంద...

కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్‌ ఎక్స్‌లో పోస్ట్‌..!

Image
హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఘాటు విమర్శలు. చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం. దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి.. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. *ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడ్‌ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు.. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. : మాజీ సీఎం & వైయస్ జగన్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో విడుదల.. మరోసారి హోస్ట్‌గా నాగార్జున.. “ఈసారి ఆటే సవాల్”!

Image
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తన పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్-10 అధికారిక ప్రోమో విడుదల కాగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌కు కూడా ప్రముఖ నటుడు Akkineni Nagarjuna హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. విడుదలైన ప్రోమోలో నాగార్జున స్టైలిష్ లుక్‌తో కనిపిస్తూ, బిగ్ బాస్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యం మాత్రమే కాదు.. లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం” అని పేర్కొన్నారు. ఈసారి ప్రోమోను వినూత్నంగా రూపొందించారు. సెలూన్లు, ఐటీ కార్యాలయాలు, ఇళ్లలో కుటుంబ సభ్యులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో చూపించారు. బిగ్ బాస్ కేవలం ఒక షో కాకుండా ప్రేక్షకుల రోజువారీ వినోదంలో భాగమైందనే సందేశాన్ని ప్రోమో ద్వారా అందించారు. ప్రోమో చివర్లో నాగార్జున మాట్లాడుతూ, “ఈ ప్రయాణం మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. ఈసారి ఆటలో సవాల్ కాదు... ఆటే సవాల్” అన...

"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు*పార్టీలు సన్నద్ధం"

Image
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది.  ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.   అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది.  కొత్త పింఛన్ల మంజూరుతో ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.  జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది...

ఆకాశంలో అద్భుతం ఈ నెల.8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’

Image
అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో 'కాస్మిక్ కిస్' (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది.   ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురు, శుక్ర గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి.  భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి.  జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను 'కాస్మిక్ కిస్'గా అభివర్ణిస్తున్నారు.