ప్రస్తుతం ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ BookMyShow లో ‘పెద్ది’ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. గంటకు ఏకంగా 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. 2023లో అవర్లీ ట్రెండింగ్ ఫీచర్ ప్రారంభమైన తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ‘కల్కి 2898 AD’, ‘సలార్’, ‘పుష్ప’ మాత్రమే ఈ ఫీట్ సాధించాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటకలోనూ రామ్ చరణ్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. అక్కడ జరిగిన ప్రీమియర్ షోల ద్వారా ‘పెద్ది’ రూ.3.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి, కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో ‘ఓజీ’, ‘రాజా సాబ్’, ‘పుష్ప 2’ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వ్యూస్‌ను దాటింది. మరోవైపు ఈ పాటలోని కొన్ని లిరిక్స్‌ను మార్చినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టిస్తూ, భారీ కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది. మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన ‘పెద్ది’ రాబోయే రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
إرسال تعليق