భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 10 ప్రత్యేక రోజుగా నిలవనుంది. ఈ రోజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నికల ద్వారా ప్రధానిగా కొనసాగిన కాలాన్ని అధిగమించనున్నారు. 2014 నుంచి వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, జూన్ 10 నాటికి 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు.
నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి 4,398 రోజుల పాటు ఎన్నికైన ప్రధానిగా సేవలందించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు, వందలాది పార్టీల మధ్య తీవ్రమైన పోటీ, సోషల్ మీడియా ప్రభావం వంటి సవాళ్ల మధ్య మోదీ ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది.
ఇద్దరు నాయకులు వేర్వేరు కాలాల్లో దేశాన్ని నడిపించినప్పటికీ, వరుసగా మూడు సార్లు ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడం వారి రాజకీయ ప్రాభవానికి నిదర్శనంగా నిలిచింది.
Post a Comment